Header Banner

విజయవాడ, విశాఖలో కలకలం రేపిన బాంబు బెదిరింపులు! పోలీసుల విస్తృత తనిఖీలు!

  Sun May 25, 2025 09:33        India

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. విజయవాడ రైల్వే స్టేషన్, బీసెంట్ రోడ్డులోని ఎల్ఐసీ కార్యాలయం, ముంబై నుంచి విశాఖపట్నం వచ్చే లోకమాన్య తిలక్ టెర్మినల్ (ఎల్టీటీ) రైలులో బాంబులు ఉన్నట్లు శనివారం కంట్రోల్ రూమ్‌లకు వేర్వేరుగా ఫోన్ కాల్స్ రావడంతో తీవ్ర సంచలనమైంది. దీంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. బాంబు స్క్వాడ్‌ను, పోలీసు జాగిలాలను రంగంలోకి దింపి విస్తృతంగా తనిఖీలు చేపట్టింది. సమాచారం అందుకున్న వెంటనే విజయవాడ పోలీసులు రైల్వే స్టేషన్‌కు చేరుకుని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.

అంతకు ముందు బీసెంట్ రోడ్డులోని షాపులన్నింటినీ మూసివేయించి తనిఖీలు చేశారు. ఎల్ఐసీ భవనం పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేశారు. ఎక్కడా అనుమానాస్పద వస్తువులు కనిపించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఫోన్ కాల్స్‌ను ట్రేస్ చేసిన సాంకేతిక సిబ్బంది అవి ఫేక్ కాల్స్‌గా నిర్ధారించారు. మరోవైపు విశాఖ రైల్వే స్టేషన్‌లో ముంబయి నుంచి వచ్చిన ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ రైలులోనూ విస్తృతంగా తనిఖీలు చేశారు. అయితే ఎల్ 2 బోగీలో ఓ అనుమానాస్పద బ్యాగ్‌ను పోలీసులు గుర్తించారు.


ఇది కూడా చదవండి: మాచర్లలో తీవ్ర ఉద్రిక్తత! టీడీపీ కార్యకర్తల జంట హత్యలు! గొడ్డలితో వెంటాడి...


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


సినిమా పరిశ్రమలో అనవసర వివాదాలు సహించం.. పవన్‌ కల్యాణ్‌ డీప్‌గా హర్ట్‌ - ఏపీ మంత్రి హెచ్చరిక!


శ్రీవారి సేవల్లో భారీ మార్పులు! ఎన్నారైలకు ప్రత్యేక ప్రణాళికలు!


ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ సీఎం భేటీ! పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులపై..


ఈ ఆధార్ 5 సంవత్సరాల తర్వాత పని చేయదు..! ఎందుకో తెలుసా?


దేశ రహస్యాలు పాక్‌కు! గుజరాత్‌లో ఆరోగ్య కార్యకర్త అరెస్ట్!


ఎల్‌ఐసీ సంచలనం! 24 గంటల్లో లక్షల పాలసీలు, గిన్నిస్ రికార్డు!


ఏపీలో కొత్తగా రెండు యూనివర్సిటీలు..! ఎక్కడెక్కడంటే ?


జర్మనీలో వైభవంగా టీడీపీ మహానాడు! పుల్వామా వీరులకు నివాళి, ప్రవాసులకు హామీ!


మహిళలకు గుడ్ న్యూస్! ఇక ఇంటి దగ్గరే సంపాదించుకునే ఛాన్స్!


బిగ్ అలర్ట్.. యూపీఐ యాప్‌లలో కొత్త మార్పులు.. జూన్ 30 నుంచి..


ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #BombThreat #Vijayawada #Visakhapatnam #AndhraPradesh #PoliceSearch #BreakingNews #PublicSafety